నా స్వీయ కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నా స్వీయ కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఫిబ్రవరి 04, 2009 | By: bloggerbharathi

చీకటి

చీకటిచీకటి
ఎంతోచీకటి
మృత్యువు అసలు
స్వరూపంచీకటి

నీలాకాశపు
నిగమము చీకటి
సౌందర్యానికి
ఆకృతిచీకటి

రాత్రికి ఆఃక్రుతినొసగె
చీకటి
మనిషికి
కలలని పంచే చీకటి

అచింత్య మైనది
అనంత మైనది
అద్వితీయమగు
నదియేచీకటి

అంతా చీకటి
ఎంతో చీకటి
అంతా ఇంతే
చీకటి చీకటి




ఫిబ్రవరి 01, 2009 | By: bloggerbharathi

జనం లో మనం

యెన్నాళ్ళనుంచో
నిన్ను చూడాలనే ఆశ

యీ దినం నిన్ను
చూడగలిగాననే త్రుప్తి

రేపు నిన్నువీడి
మనలేనెమో అన్న భయం

వీటిమధ్య
కొట్టుమిట్టాడుతున్నాం మనం