ఫిబ్రవరి 04, 2009 | By: bloggerbharathi

చీకటి

చీకటిచీకటి
ఎంతోచీకటి
మృత్యువు అసలు
స్వరూపంచీకటి

నీలాకాశపు
నిగమము చీకటి
సౌందర్యానికి
ఆకృతిచీకటి

రాత్రికి ఆఃక్రుతినొసగె
చీకటి
మనిషికి
కలలని పంచే చీకటి

అచింత్య మైనది
అనంత మైనది
అద్వితీయమగు
నదియేచీకటి

అంతా చీకటి
ఎంతో చీకటి
అంతా ఇంతే
చీకటి చీకటి




ఈ లోకం లో

ఈలోకం లొ, నా దేశం లో
నా ఇప్పటి దేహం తో
ఎన్నాళ్ళైనా బ్రతకట మిష్టం
ఎపుడు ర్రాలినా ఇష్టం //
ఈలోకం లొ//

సంసారం సాగరమైతే
జలక్రీడగాజీవనమిష్టం
తిరిగి పుట్టుటకే మరణం ఐతే
మరణం అంటే మరి మరి ఇష్టం //
ఈలోకం లొ//

పొరపాటున మోక్షం వస్తే
పుట్టుక లేకుండా పొతే
ఇలా తలానికి దూరంగా
ఎలాగాన్నదే నాకు భయం //
ఈలోకం లొ//

బాల్యం అంతా ఆటగా
వయసే పున్నమి
బాటగా
మనసే చల్లని మాటగా
బ్రతుకంతా శ్రుతిలో కలిసిన పాటగా నే పాడగా //
ఈలోకం లొ//

( పాట స్వరపరిచింది శ్రీ పాల గుమ్మి విశ్వనాథం గారు )
ఫిబ్రవరి 01, 2009 | By: bloggerbharathi

జనం లో మనం

యెన్నాళ్ళనుంచో
నిన్ను చూడాలనే ఆశ

యీ దినం నిన్ను
చూడగలిగాననే త్రుప్తి

రేపు నిన్నువీడి
మనలేనెమో అన్న భయం

వీటిమధ్య
కొట్టుమిట్టాడుతున్నాం మనం

నగేష్.=హాస్యం= నగేష్

ఏడవడానికి కారణం కావాలేమో కానీ నవ్వడానికి సందర్భం అవసరం లేదు.
నవ్వడం, నవ్వించడం ఒక గొప్ప వరం
మనుషులు చాలా ఉంటారు కానీ నవ్వించే మహా మనుషులు కొంతమందే ఉంటారు. అలాంటి కోవకు చెందిన మహా మనిషి హాస్య నటుడు నగేష్.
నవ్వించి నవ్వించి
నవ్వుల్ని ప్రోది చేసుకుని దాచుకొండర్రాఅని ఇహ లోకం లో
తన పని ముగించుకుని,
అలిసి పోయిన
స్వర్గ వాసుల్ని తన నవ్వులతో సేద తీర్చడానికి హడావుడిగా వెల్ల్ల్ల్లిపోయిన నగేష్
పాపం పసివాడు సినిమా లో నటన మనల్ని ఇంకా ఏడిపించట్లేదూ......?
నగేష్ భౌతికంగా మనతో ఉండరు.
కానీ ఆయన పంచిన నవ్వులు ఉంటాయి . మనతోనే శాశ్వతంగా