మార్చి 22, 2010 | By: bloggerbharathi

వినోదములు-11

          ఆపస్తంబుడు , అశ్వలాయనుడు అను నిద్దరు మహామునులు బ్రాహ్మణధర్మములను  సూత్రములుగా  వ్రాసిరి .మొదటివాని సూత్రముల నవలంబించినవా రాపస్తమ్బసూత్రులనియు , రెండవవాని సూత్రమ్బులనవలమ్బిన్చినవారి నశ్వలాయనసూత్రులనియు జెప్పుదురు. నూజివీటి  యప్పారావు వారియోద్ద ఉద్యోగము సెయునొక బ్రాహ్మణుడు ఒక యగ్రహారమునకు బోయి యుండ , నచ్చటి వైదికు లతనితో మీరాపస్తంబులా , యశ్వలాయనులా యని యడిగిరి. .జన్మ మధ్యమండా మాట లెన్నడూ విననివాగుచే  నాతడు  మే రాపస్తంబులము,  నశ్వలాయనులము  ,గాము, అప్పారావుగారి హర్కారాలమని వాపోయెను (  ఈ కధలు పాతకాలంలో హరికదల మధ్యలో పిట్టకధలుగా చెప్పేవారు. . )