జులై 28, 2022 | By: bloggerbharathi

రామ రామ అన్న పాట



రాముల వారిమీద ఒక పాట 


 రామ రామ రామ యన్న రామ చిలుక  ధన్యమూ

 రామ ప్రేమ  చూరగొన్న చిట్టి ఉడుత  ధన్యమూ 


అభినందన లందుకొన్న కోతిమూక ధన్యమూ 

ఆశీస్సులు పొందినా పక్షి రాజు ధన్యమూ 

//రామ రామ రామ యన్న//

రేగిపళ్లు తినిపించిన శబరిమాత ధన్యమూ 

నావనడిపి దరిజేర్చిన గుహుని సేవ ధన్యమూ

 పాద ధూళి  సోకినట్టి శిల యెంతో ధన్యమూ

వారధి నిలిపిన సాగర జలమెంతో ధన్యమూ//రామ రామ రామ యన్న//


మధురాతి మధురము రెండక్షరముల మంత్రమూ 

సత్యధర్మ విక్రమము రాముని అవతారము 

శ్రీరాముని అవతారముశ్రీ రాముని అవతారము