ఏప్రిల్ 05, 2010 | By: bloggerbharathi

చెప్పాలంటే

మూడు దశాబ్దాల అనుభవాలు చిన్నప్పటి నుంచి అడపా దడపా జరిగిన సంఘటనలు, నా ప్రతిస్పందనలు ఈ బ్లాగు లో వ్రాస్తూనె సాధ్యమైనంత వరకు కొందరికైనా ఉపయోగ పడేలాగా దీన్ని రూపు దిద్దాలని నా ప్రయత్నం .

నిజం చెప్పాలంటే ఆఫీసు కి వెళ్తే మా తో బాటు చేరిన చాలామంది సహోద్యోగులు
పదవీ విరమణ చేసిఉండడం వలన , కొత్తగా రకరకాల విధానాల్లో నియామకాలు చేపట్టటం వల్లా
కొంతవరకు మా సమయం లో చేరిన వాళ్ళుఎవరూ ప్రతిరొజూ కలవ లేక పోవటం వల్లా మేము
కొంత వరకూ ఒంటరిగా,పని వత్తిడి తో ఫీల్ ఔతున్నా మన్నది నిజం . ఈ బ్లాగ్ ద్వారా అలాంటి వాళ్ళనందరిని కలవడం,మాట్లాడ్డం, మంచి,మాటా కలబోసుకోడం కూడా ఒక ఉద్దేశ్యం.ఇదే కాక రెవిన్యూ డిపార్టుమెంటు లో పని చేసిన, చేస్తున్న అందరి తోనూ కలివిడి గా ఉండేందుకే నా ఈ
ప్రయత్నం . బ్లాగు ద్వారా అందరికి సంబంధించిన సంగతులు అయినా పంచుకోవచ్చు