ఏప్రిల్ 08, 2010 | By: bloggerbharathi

అత్యాష

ఒకటికి ఆరు రెట్లు ఇస్తామని ఇరవైడు కోట్లు రూపాయలు వసులు చేసి ఆ సొమ్ముని షేర్లలో పెట్టి, నష్ట పోయి ఆత్మహత్య చేసుకున్న తల్లి, తండ్రులు, విస్తుపోయి, మైండు పాడైపోయి వెర్రి చూపులు చూస్తున్నా వారి కొడుకు, ఈరోజు టీవీ లో వార్తలలో చెప్పినవిషయం విని ఎంతొ బాధేసింది.
యెoదుకీ అత్యాశ?
కన్న పిల్లల్ని కస్టపడి ఎదగమని , శ్రమయే ఎదగ దానికి సూత్రమనీ చెప్పి, నిజాయితీ తో పిల్లలని పెంచటం మన పాడడాలు మనకి నేర్పిన నిఇతి
మరి ఆ పెద్దలే అత్యాసః కి పోయి ఇలా చేయడం భావ్యమేనా?
ఒకసారి వాళ్ళు జలదరించింది.

పొద్దున్న అనగా పోయి పోద్దుత్నించి సాయంత్రం దాకా జివిక నడవడానికి బతుకుతెరువు కోసం బ్రతికే వాళ్ళమే ఎక్కువ. ఇలాంటి అత్యాషలు తలకేక్కకుండా ముందు మన పిల్లలకి ఒక్కొక్క మెట్టూ ఎక్కడం లో ఉన్న్న మానిసిక ప్రశాంతత ని వివరంచాలి. వాళ్ళు దారి తప్పి , అత్యాశకి పోయి తప్పు చేస్తున్నట్లనిపిస్తే హెచ్చరించాలి. అలాంటిది పెద్దలే పప్పులో కాలేస్తే కుటుంబమే పాడైపొలెదూ ? వాళ్లకి సంబంధించిన కుటుoబీకులు బ్రతికినన్ని రోజులు వేలెత్తి చూపించు కుంటూ ఎలా బ్రతకాలి , ఎలా బ్రతకాలి
మన ఆనందం, అత్యాశ్యా మన తర,తరాల బన్ఢువులనీ ఇలా వెలి చుపులకి బలి చేయడం సమంజసమేనా


ఎందుకిలా జరుగుతోంది?
మనం తినేది ఒక్క ముద్దా కట్టేది ఒక్క బట్టా
మన కోసమే ఐతే ఇంత సంపాదన , ఇంతమంది చదువులు చదివి , మంచి ఉద్యోగం చేస్తే చాలదా /
మనిషి ఆయువు వంద ఎల్లైతే దాన్లో యాభి ఏళ్ళు నిద్ర పోతానికే సరిపోతుంది. దాదాపు పడి ఏళ్ళ వయసు దాకా పెద్దల పెంపకం లోనే జరిగి పోతుంది.
అంటే మొత్తం అరవై ఏళ్ళ బ్రతుకు ఉట్టిగానే వెళ్ళిపోతుంది. మిగిలిన నలభై ఏళ్ళ బ్రతుకులో కొంచం మంచి, కొంచం ప్రేమ, కొంచం డబ్బు చాలవా ?
ప్రతి ఒక్కళ్ళు ఒక అంబానియో , బిర్లా నో, ఒక రతన్ టాటా నో కావాలని ఆశ. అంటే కాదు వాళ్ళలాగా హై క్లాసు బ్రతుకు గడపాలని ఆశ. వాళ్ళలాగా పది మందిని బ్రతించాలని కాకుండా ముంచాలని , తద్వారా తాము కార్లలో,తిరుగుతూ, ఖరీదైన జీవితం గడపాలనీ వెంపర్లాట .
ఎందుకిదంతా
తా దురలేదు, మెడ కో డొలని మన బ్రతుకు,మనం బ్రతకడానికి, ఇంతమంది జిఇవితాలతో ఆడుకోవడం అవసరమా


ఇక్కడ ముఖ్యంగా మరో విషయం ఉంది.
రూపాయి కి ఆరు అనగానే డబ్బుఇచిన వాళ్లకి బుద్ధి లేదు .
ఇది నా వ్యక్తిగతమైన బాధ మాత్రమె. అందరు నాతొ ఎకిభావించాలని లేదు. ఎవరిష్టం వాళ్ళది.

ఏప్రిల్ 05, 2010 | By: bloggerbharathi

చెప్పాలంటే

మూడు దశాబ్దాల అనుభవాలు చిన్నప్పటి నుంచి అడపా దడపా జరిగిన సంఘటనలు, నా ప్రతిస్పందనలు ఈ బ్లాగు లో వ్రాస్తూనె సాధ్యమైనంత వరకు కొందరికైనా ఉపయోగ పడేలాగా దీన్ని రూపు దిద్దాలని నా ప్రయత్నం .

నిజం చెప్పాలంటే ఆఫీసు కి వెళ్తే మా తో బాటు చేరిన చాలామంది సహోద్యోగులు
పదవీ విరమణ చేసిఉండడం వలన , కొత్తగా రకరకాల విధానాల్లో నియామకాలు చేపట్టటం వల్లా
కొంతవరకు మా సమయం లో చేరిన వాళ్ళుఎవరూ ప్రతిరొజూ కలవ లేక పోవటం వల్లా మేము
కొంత వరకూ ఒంటరిగా,పని వత్తిడి తో ఫీల్ ఔతున్నా మన్నది నిజం . ఈ బ్లాగ్ ద్వారా అలాంటి వాళ్ళనందరిని కలవడం,మాట్లాడ్డం, మంచి,మాటా కలబోసుకోడం కూడా ఒక ఉద్దేశ్యం.ఇదే కాక రెవిన్యూ డిపార్టుమెంటు లో పని చేసిన, చేస్తున్న అందరి తోనూ కలివిడి గా ఉండేందుకే నా ఈ
ప్రయత్నం . బ్లాగు ద్వారా అందరికి సంబంధించిన సంగతులు అయినా పంచుకోవచ్చు
ఏప్రిల్ 04, 2010 | By: bloggerbharathi

సాగే జీవన రాగం

చాలా రోజులతర్వాత నాబ్లాగు లో ఏదైనా రాద్దామని కూర్చున్నాను.
ఎండలు మండి పోతున్నై అంటే అందరు నవ్వుతారు. ఇదెమీ చెప్పాల్సిన విషయం కాదె అనుకుంటారు కూడా


కర్ఫ్యూ వల్ల జనాలు ఎంత బాధ పడుతున్నారో అంటే కర్ఫ్యూ పెట్టడమే (సామాన్యజనాన్ని) బాధ పెట్టడానికే కదా దాన్లో ప్రత్యేకించి అనుకోడానికి ఏముంది అంటారేమో
కానీ నేనేదైనా చెప్పాలి.


అన్నట్టు గర్భిణీ స్త్రీలని కానుపుకు కూడా అనుమతి ఇవ్వనంత తప్పు వాళ్ళేమి చేసారో, ఈ మగాళ్ళకి నొప్పులోచ్చి ఆ నొప్పలతో ఒక్కడంటే ఒక్కడు బాధ పడ్డా కర్ఫ్యూకాదు దానమ్మ ఉన్నాఆ ఆడమనిషిని ఆసుపత్రిలో జేర్చడానికి అ పోలిసోల్లె సహాయమందించే వాల్లేమో .
మళ్ళి సాయపడ్డ వాళల్లోకూడా మీడియా పొటీ . మాచానేల్ గొప్ప చూసారా, ప్రసవ వేదన పడుతుంటే ముందుండి హాస్పిటల్ కి పంపించాం . మేమెంత ముందున్నామో చూసారా ? తాము చేసామని చెప్పుకున్టూనె , అవతల వాళ్ళు ఏం చేయలేదో, తామెంత గొప్పో హయిగా చెప్పుకుంటూ,మా చానెల్ చేసిన పని మీకు నచ్చిందా . మీకు నచ్చితే ----అని టైపు చేసి స్పేస్ ఇచ్చి గొప్ప మీ చానేలే అని వ్రాసి గోవిందా గోవిందా అన్న సెల్ నెంబర్ కి మెసేజ్ చేయండి --మర్చిపోకండి ----ఇలా సాగిపోతోంది ఒక చానెల్ గోల.


ఆ మహతీ... ప్రముఖ బొంగారాలాడే తార మానియా పెళ్ళంట కదా . వాళ్ళింటి ముందు ఇప్పుడు ఎంతమంది జనాలున్నారు,హడావుడి ఎలా ఉంది వివరాలు చెప్పండి ...తూఊఊఊఊఊఊఉఇ హలో.....హలో మహతి నామాటలు వినిపిస్తున్నాయా

.
ఇంతలో అవతల్నిచి హలో బాబీ నేనిప్పుడు, ఇప్పుడేంటి ఇవ్వాళ ఉదయం నిన్చీబొంగారాలాడే తార మానియా ఇంటిముందే ఉన్నాను వాళ్ళింట్లో అందరు హాయిగా తిని, తాగి డాన్స్ చెస్తూ సంతోషంగానే ఉన్నారు. మన మీడియా వాళ్ళు తప్ప అందఋ హాయిగా , వాళ్ళ వాళ్ళఇళ్ళల్లో నిద్రపోతున్నారు, అంతే కాదు, పరిక్షల కారణం గా వాళ్ళ వాళ్ళ పిల్లని చదివిన్చుకున్తూ జనాలందరూ కూడా వాళ్ళ, వాళ్ళ ఇళ్ళల్లో ప్రశాంతంగా ఉన్నారు.దరిద్రం అంటుకున్నట్లు , మన మీడియా వాళ్ళు మాత్రమె బొంగారాలాడే తార మానియాఇంటిముందు పడిగాపులు గాస్తున్నారు. ఇప్పుడు సమయం రాత్రి సుమారు పన్నెండు గంటలయింది, ఇప్పుడు మానియా ,వాళ్ళ అమ్మగారు కలిసి ఎటో వెళ్తున్నారు, మా పరిశోధనలో మన క్లూస్ టీమ్ చెప్పిన వివరాల ప్రకారము వాళ్ళు రెస్ట్ రూం కి వెళ్తున్నట్లు తెలిసింది,
ఇంతలో స్టూడియో నించి న్యూస్ రీడరు ఆ.. మహతీ, ఇప్పుడే వాళ్ళ పెరటి దోవ నుంచి మన ఛానల్ కి ఎక్స్ క్లుసివ్ గా వార్త లం దిం చ టానికి మన మురళి లైన్ లో ఉన్నారు మరి ఆ వార్త లేంటో చూద్దం లైన్ కట్ ఇలా సాగుతూ ఉంటుంది ఎక్స్ క్లుసివ్ వార్తలని అందించే తపన. ఇది ఎవరికీ ఏ రకంగా ఉపయోగమో ఆ చానల్ వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఈ బాధలన్నీ పడలేక దేవుడు ముందు చూపుతొ రాయి అయి పోయాడు గనక.

మన మేమైపోతామో, ముందు, ముందు పిచాసుపత్రులకి ఎంత గిరాకీ వస్తుందో చేప్పక్కరలేదనుకుంటా. ఇది సాగే జిఇవన రా ఆఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ గం

ఇలాంటి పొగడ్తలు , స్వోత్కార్షలు వింటున్నా, చూస్తున్నానాకో కధ జ్ఞాపకం వస్తుంది. మహా భారతం లో అభిమన్యుణ్ణి ప్రత్యర్ధులు పద్మవ్యూహం లో సంహరించినప్పుడు , తానూ లేని సమయం లో, తనకుమారుణ్నిఒంటరిని చేసిప్రత్యర్ధులు చంపుతుంటే , ఇంతమంది పెద్దనాన్నలు, చిన్నాన్నలు ఉండి కూడా తన తనకుమారుణ్నికాపాడ లేక పోయిందుకు నిందించిన అర్జునుడు ఆవేశం తగ్గినాక తన తప్పు తెలుసుకునిపశ్చాత్తాపంతో , కృష్ణా , వాసుదేవా
ఆవేశంలో పెద్దంతరం, చిన్నంతరం మర్చిపోయి , పుత్ర శోకం తో నా అగ్రజులను, తమ్ములను అనరాని మాటలన్నాను , నా యీ తప్పుకి ఏదైనాప్రాయచిత్తం సెలవియ్యమని వేడుకున్నాడు. దానికి సమాధానం గా వాసుదేవుడు ఈ విధంగా తరుణోపాయం చెప్పాడు.

అర్జునా , చెబుతాను, విను. ఎవరైనా వాక్చాతుర్యం ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్లి, నిన్ను అలసిపోయే దాకా పోగిడించుకో . ఆ పొగడ్త లే నీకు ప్రాయచిత్తం. అని సెల విస్తాడు.

మరి మన చానల్స్ కి మనల్ని ఇంత బాధ పెడుతున్నందుకు ప్రాయచిత్తమే లేదా, అయినాపశ్చాత్తాప పడ్డ వాళ్ళకే కదా ప్రాయచిత్తం......................................
మార్చి 22, 2010 | By: bloggerbharathi

వినోదములు-11

          ఆపస్తంబుడు , అశ్వలాయనుడు అను నిద్దరు మహామునులు బ్రాహ్మణధర్మములను  సూత్రములుగా  వ్రాసిరి .మొదటివాని సూత్రముల నవలంబించినవా రాపస్తమ్బసూత్రులనియు , రెండవవాని సూత్రమ్బులనవలమ్బిన్చినవారి నశ్వలాయనసూత్రులనియు జెప్పుదురు. నూజివీటి  యప్పారావు వారియోద్ద ఉద్యోగము సెయునొక బ్రాహ్మణుడు ఒక యగ్రహారమునకు బోయి యుండ , నచ్చటి వైదికు లతనితో మీరాపస్తంబులా , యశ్వలాయనులా యని యడిగిరి. .జన్మ మధ్యమండా మాట లెన్నడూ విననివాగుచే  నాతడు  మే రాపస్తంబులము,  నశ్వలాయనులము  ,గాము, అప్పారావుగారి హర్కారాలమని వాపోయెను (  ఈ కధలు పాతకాలంలో హరికదల మధ్యలో పిట్టకధలుగా చెప్పేవారు. . )



వినోదములు-10

ఒక బైరాగి  ఎండ లోమట్ట మధ్యాన్నమున ఒక బ్రాహ్మణుని  ఇంటికి బోయి "నా కాకలి చేత బ్రాణములు పోవుచున్నవి , కొంచము గంజి యన్నము నాకు బెట్టితిరేని  మీ కాకలి దప్పులు లెకుండగ నొక సిద్ధౌషద  మిచ్చెద "నని   చెప్పెను. 
బ్రాహ్మణుడా మాట విని "మా కాకలి లేకుండ మందియ్యగాలవాడవు నిఇవేల యా మందు పుచ్చుకొనవని"పరిహసించి పంపెను